Tuesday, October 31, 2023

Kanave Kanave (Telugu)

Movie: David
Music: Anirudh
Original Telugu Lyrics: Krishna Chaitanya

Alternate Lyrics:  Sri Annapragada

గాలివానే జాలి లేక కంటి నీరై చేరెనే...
గాజు బొమ్మే గుండెనంతా గాయమల్లే మార్చెనే...

అడుగు ఆగదే.. అలుపు తీరదే..
సుడుల సంద్రము తాకితే...
గతము వీడదే.. గురుతు మారదే..
అలలు తీరం చేరవే..?!

కలలు కలలే.. కనుల నిండా..
నిదుర వదిలే ప్రాణమంతా...
కలలు కలలే.. కనుల నిండా..
నిజము తెలిసీ కలవరింతా..?

మాట జాడే తెలియదే..
మరణమయినా హాయిలే..
ఊహ కూడా ఊరుకోక ఊరికే నిను తలుచునా..!!
ఓ..ఓ.. జతను కోరిన హృదయమే..
జరగనన్నది కాలమే...
నిమిషమైనా ఆగుతుందా నిన్ను మరచే యాతన...

ఇది న్యాయమా.. పరిహాసమా...
నా ప్రేమకే ఇది సాధ్యమా...!?

|| కలలు కలలే.. కనుల నిండా.. ||

Tuesday, September 5, 2023

పంచముఖం... శివం...

పరమశివుడికి పంచ ముఖాలు... అవి తత్పురుష (తూర్పు), సద్యోజాత (పడమర), వామదేవ (ఉత్తర), అఘోరా (దక్షిణ), ఇషాణ (ఆకాశ)... ఈ పంచముఖాలు పంచ దిక్కులను చూస్తుంటాయి... ప్రతీ ముఖానికి ఒక రంగు అన్వయించబడి ఉంటుంది... అలాగే ప్రతీ ముఖానికి కొన్ని నిర్ధిష్టమైన లక్షణాలు కూడా ఉంటాయి... ఇవన్నీ శివపురాణంలో వివరంగా చెప్పబడి ఉన్నాయి...

శివుడు... రుద్రుడు... మహాదేవుడు... పరమేశ్వరుడు... ఇలా ఎన్నెన్నో పేర్లు, ఇంకెన్నో రూపాలు... అంకెలకు అందని నా శివుడికి అయిదే ముఖాలా..? అదెలా..? బహుశా మనిషికి అందటం కోసమేమో... ఎంతైనా భోళా శంకరుడు కదా... అందుకే విశ్వమంత శివుడికి నా ఈ వీసమెత్తు స్తోత్రాభిషేకం...

శిరాన సోమ ధారణం... ఝటాన గంగ తాండవం...

శరీర భస్మ లేపనం... చిదాత్మ లాస్య పూరితం...

కరాన మృత్యు దండనం... ఇచ్ఛాది శక్తి కారకం... 

విశాల విశ్వ భాషితం... మనోమయాచ వర్ధతం...

పృథూ వికాస కారణం... వర్ణేతి ధవళ శోభితం...

ప్రమోదరాగ్ని జ్వాలితం... ప్రతీచి పూర్ణ మస్తకం... 

భయాపహార రక్షితం... లయోపకార శిక్షితం...

నమోస్తు సద్యోజాతహం... ముఖాభి పంచకం శివం...

ప్రభాత ప్రాచ్య మానసం... ప్రకాశ పీత చందనం...

త్రినేత్ర దృష్టి సిద్ధితం... త్రిలోక పీడ వీక్షణం...

మూలాధారానధిష్టితం... మనః ప్రతిష్ట కారకం...

ఆనంద ధ్యాన దర్పణం... మనోరూపేణ లాలసం...

అఖండ తత్వ చింతనం... అహం బ్రహ్మాండ మిశ్రితం...

ధరాతలాన యోగ్యతం... కైలాస మోక్ష ప్రాప్తితం...

స్వయంభు లింగ దర్శనం... త్రిశూల వేద్య సంహితం...

సతత్పురుష మూర్తితం... ముఖాభి పంచకం శివం...

ప్రపుల్ల నాద డంఢనం... ప్రకోప ఢంక వాహనం...

ప్రదోష హాల కంధరం... ప్రతాప ధాటి కండరం...  

పినద్ధ వ్యాఘ్ర ఖేటకం... పినాక ధారి రుద్రయం...

కరాళ కాల భూషణం... కృపీట యోగ లక్షణం...

సుధూమ్ర వర్ణ వచ్ఛసం... సుధూమ్రనాథ పూజితం...

శ్మశాన ధర్మ శాసనం... అవాచి ప్రాకృతస్యకం...

నిర్యాణ భీతి నాశకం... నిర్వాణ భద్ర భైరవం...

నమో అఘోర దర్శనం... ముఖాభి పంచకం శివం...

విశుద్ధ చక్ర ప్రాంకురం... విస్పోట శక్తి సేవితం...

వినీల శూన్య ఆకసం... విఘాత లేమి త్రోవనం...

అమేయ పూర్ణ ఊర్ధ్వయం... అమోఘ తార వీక్షితం...

గాఢాంధకార తామసం... వివిక్తమం చిదంబరం... 

విశ్వాంతరాళ ఛేదనం... మహాదేవాది విస్తృతం...

అయోగ్య విష్ణు నిశ్వసం... బ్రహ్మాది శాప హేతుకం...

విలాస్య నాట్య హాసితం... పవిత్ర పార్వతి ప్రియం...

నమో ఇషాణ రూపితం... ముఖాభి పంచకం శివం...

స్వయంభు ప్రాణి జీవనం... స్వపంచ వాయు పూరణం...

సమస్త ధాతు ద్రవ్యయం... స్వకంప స్పర్శ మాధురం...

విరక్త వర్ణ భౌతికం... విరించి వీర కీర్తనం...

చతుర్ముఖస్య శ్లాఘనము... చిదాత్త రూప కర్మణం...

ఉదీచి లోక పాలకం... అనంత తేజ మూర్తిభం... 

కుబేర వంశ అర్చితం... శ్రీ కాళ హస్తి విగ్రహం...

యోగాది ఆసన క్రమం... విద్వాంస భూరి ఆకృతం...

నమోస్తు వామదేవతం... ముఖాభి పంచకం శివం...

Meaning: 

శిరాన సోమ ధారణం... ఝటాన గంగ తాండవం...

He who wears moon on the head as an ornament... He who has the mighty Ganga dancing in his braids... 

శరీర భస్మ లేపనం... చిదాత్మ లాస్య పూరితం...

He whose body is immersed in ash... He whose face is filled with a pleasant meditative smile... 

కరాన మృత్యు దండనం... ఇచ్ఛాది శక్తి కారకం... 

He who holds the most potent weapon in the hand... Which bestows energy for the desired... 

విశాల విశ్వ భాషితం... మనోమయాచ వర్ధతం...

He who speaks across the universe... And blesses our desires without being asked... 

పృథూ వికాస కారణం... వర్ణేతి ధవళ శోభితం...

He who awakens the entire world... With his white aura... 

ప్రమోదరాగ్ని జ్వాలితం... ప్రతీచి పూర్ణ మస్తకం... 

He who shines like the brightest fire... With his west facing face...

భయాపహార రక్షితం... లయోపకార శిక్షితం...

He who saves from all the fears... He who destroys all the bad... 

నమోస్తు సద్యోజాతహం... ముఖాభి పంచకం శివం...

I worship you Sadyojata (a face of Shiva)... Which is one of his five faces... 

ప్రభాత ప్రాచ్య మానసం... ప్రకాశ పీత చందనం...

He who rises like a morning sun from the east... With the bright yellow glow... 

త్రినేత్ర దృష్టి సిద్ధితం... త్రిలోక పీడ వీక్షణం...

He who has the power of three eyes... He who can see all the misery across the universe... 

మూలాధారానధిష్టితం... మనః ప్రతిష్ట కారకం...

He who commands the Mooladhaara (the base chakra of our body)... He who stabilizes our mind... 

ఆనంద ధ్యాన దర్పణం... మనోరూపేణ లాలసం...

He who mirrors with meditative bliss... He who is happy from within... 

అఖండ తత్వ చింతనం... అహం బ్రహ్మాండ మిశ్రితం...

He who forsees till eternity... He who is a culmination of entire universe within you... 

ధరాతలాన యోగ్యతం... కైలాస మోక్ష ప్రాప్తితం...

He who makes you desirable on this world... He who blesses you with salvation towards Kailasa... 

స్వయంభు లింగ దర్శనం... త్రిశూల వేద్య సంహితం...

He who manifests in a linga... He who can curate the whole Vedas with his Trisulam... 

సతత్పురుష మూర్తితం... ముఖాభి పంచకం శివం...

I worship you Tatpurusha (a face of Shiva)... Which is one of his five faces... 

ప్రపుల్ల నాద డంఢనం... ప్రకోప ఢంక వాహనం...

He who creates cosmic music with his damarukam... He who rides the angry bull... 

ప్రదోష హాల కంధరం... ప్రతాప ధాటి కండరం...  

He who stored the darkening poison in his neck... Which shows his mighty muscle... 

పినద్ధ వ్యాఘ్ర ఖేటకం... పినాక ధారి రుద్రయం...

He who is dressed with the skin of the tiger... He who commands the bow Pinaaka... 

కరాళ కాల భూషణం... కృపీట యోగ లక్షణం...

He who wears dangerous snakes as ornaments... And maintains them pleasantly in a yogic way... 

సుధూమ్ర వర్ణ వచ్ఛసం... సుధూమ్రనాథ పూజితం...

He whose face is coloured grey like ash and smoke... He who is worshipped by Ravana... 

శ్మశాన ధర్మ శాసనం... అవాచి ప్రాకృతస్యకం...

He who mandates the law of the dead... He whose face is directioned towards South... 

నిర్యాణ భీతి నాశకం... నిర్వాణ భద్ర భైరవం...

He who vanishes the fear of the dead... He who safeguards our afterlife... 

నమో అఘోర దర్శనం... ముఖాభి పంచకం శివం...

I worship you Aghora (a face of Shiva)... Which is one of his five faces... 

విశుద్ధ చక్ర ప్రాంకురం... విస్పోట శక్తి సేవితం...

He who can be as small as a seedling... He who has the energy of a violent explosion...

వినీల శూన్య ఆకసం... విఘాత లేమి త్రోవనం...

He who occupies the entire sky... He who guarantees a safe passage without obstruction...

అమేయ పూర్ణ ఊర్ధ్వయం... అమోఘ తార వీక్షితం...

He who has an endless face on the top... Which can monitor entire stars...

గాఢాంధకార తామసం... వివిక్తమం చిదంబరం... 

He who is filled in the black darkness... Which is unexplainable (like dark matter and black hole)... 

విశ్వాంతరాళ ఛేదనం... మహాదేవాది విస్తృతం...

He who can conquer the edges of the universe... He who can spread across in the entirety...

అయోగ్య విష్ణు నిశ్వసం... బ్రహ్మాది శాప హేతుకం...

He who is worshipped by even Lord Vishnu... He who is able to curse even Lord Brahma...

విలాస్య నాట్య హాసితం... పవిత్ర పార్వతి ప్రియం...

He who can dance with joy... With his beloved wife Parvathi...

నమో ఇషాణ రూపితం... ముఖాభి పంచకం శివం...

I worship you Ishaana (a face of Shiva)... Which is one of his five faces... 

స్వయంభు ప్రాణి జీవనం... స్వపంచ వాయు పూరణం...

He who manifests in the entire living... He who fills all the air in our bodies...

సమస్త ధాతు ద్రవ్యయం... స్వకంప స్పర్శ మాధురం...

He who is the basis for our existence... He who is the basis for our senses...

విరక్త వర్ణ భౌతికం... విరించి వీర కీర్తనం...

He who wears red... Like a hymn of a hero from battlefield...

చతుర్ముఖస్య శ్లాఘనము... చిదాత్త రూప కర్మణం...

He who is praised by Lord Brahma... He who bestowed the spiritual and meditative posture...

ఉదీచి లోక పాలకం... అనంత తేజ మూర్తిభం... 

He who rules the North... He who is a manifestation of endless light...

కుబేర వంశ అర్చితం... శ్రీ కాళ హస్తి విగ్రహం...

He who is worshipped by Kubera and his dynasty... He who took the invisible form of Sri Kalahasthi deity...

యోగాది ఆసన క్రమం... విద్వాంస భూరి ఆకృతం...

He who has given us Yoga and meditation... He who is a symbol of extensive art forms...

నమోస్తు వామదేవతం... ముఖాభి పంచకం శివం...

I worship you Vaamadeva (a face of Shiva)... Which is one of his five faces...