Movie: David
Music: Anirudh
Original Telugu Lyrics: Krishna Chaitanya
Alternate Lyrics: Sri Annapragada
గాలివానే జాలి లేక కంటి నీరై చేరెనే...
గాజు బొమ్మే గుండెనంతా గాయమల్లే మార్చెనే...
అడుగు ఆగదే.. అలుపు తీరదే..
సుడుల సంద్రము తాకితే...
గతము వీడదే.. గురుతు మారదే..
అలలు తీరం చేరవే..?!
కలలు కలలే.. కనుల నిండా..
నిదుర వదిలే ప్రాణమంతా...
కలలు కలలే.. కనుల నిండా..
నిజము తెలిసీ కలవరింతా..?
మాట జాడే తెలియదే..
మరణమయినా హాయిలే..
ఊహ కూడా ఊరుకోక ఊరికే నిను తలుచునా..!!
ఓ..ఓ.. జతను కోరిన హృదయమే..
జరగనన్నది కాలమే...
నిమిషమైనా ఆగుతుందా నిన్ను మరచే యాతన...
ఇది న్యాయమా.. పరిహాసమా...
నా ప్రేమకే ఇది సాధ్యమా...!?
|| కలలు కలలే.. కనుల నిండా.. ||
No comments:
Post a Comment