Saturday, May 24, 2025

Amma - A Heartful short film

Lyrics: Sri Annapragada 
Music by: K.V. Bharadwaj
Singers: Srilatha Dhulipalla, AbhiRam Dantuluri 
Cast: Indrani Davuluri, Sambi Mandala, Sudha Kondapu, Reena Bommasani  
Written and directed by: Harish Bannai

Mother version:
కన్నా.. కన్నా.. వినవా నా మాట..
నిన్నే.. కన్న.. అమ్మకి ఈ పూట..
కని పెంచిన కనికరమే కరువయ్యేనా..
కనిపించని కన్నీళ్ళే తోడయ్యేనా...

చిన్ని చిన్ని పాదాలేమో..
పందెం పరుగై దూరం పెరిగే...
అమ్మా అంటూ పాటలు పాడే..
గొంతే నేడు అలుసుగా చూసే...
ఏమిస్తే ఆగేనో అలకల సంద్రం..?
మరి ఏ పొద్దు పూసేనో అలసిన బంధం..?
అలలెన్నో దాటే ప్రేమే నేడు..
ఎల్లలనే చూపించిందా..?!

కన్నా వినవా... కన్నా వినవా...
నీకన్నా ఎవరే విలువ...!!
కన్నా వినవా... కన్నా వినవా...
నాకున్న ప్రేమే కనవా...


Son version:
అమ్మా.. అమ్మా.. విన్నా నీ మాట...
నన్నే కన్న అమ్మకు ఈ పూట...
రానీయను కన్నీళ్లను ఏ క్షణమైనా...
కావలిగా తోడుంటా ఏదేమైనా...

చిన్ని చిన్ని మాటలు అన్నీ..
చిలికి చిలికి గాయం చేసే...
కన్నా అంటూ ప్రేమగా చూసే..
కనులే నేడు కన్నీరాయే...
ఏమిస్తే తీరేనో చేసిన పాపం...
మరి ఏ రోజు తొలగేనో నీలో మౌనం...
కడదాకా ఒడిలో ఒదిగి నీకే గుండెల్లో గుడి కట్టైనా...

అమ్మా వినవా... అమ్మా వినవా...
నాకున్న ప్రేమే కనవా...
అమ్మా వినవా... అమ్మా వినవా...
నీకన్నా ఎవరే విలువ...!!

Watch it here on YouTube:

Radha Rishi - A Musical Featurette

Lyrics: Sri Annapragada
Composition and Scoring: K.V. Bharadwaj 
Singers: Karthik, Lakshmi Meghana, Abhigna Yanaganti
Cast: Phani Sivaraju, Kushitha Kallapu, Lakshmi Teja
Story, Screenplay and Direction: Phani Sivaraju


పల్లవి:
అడగవా.. అడగవా.. నిజం ఏమైందో...
చివరగా.. మిగిలిన.. గతం కానుందో..?
తన ఊసేదని అలిగిందా మరి..?
నిలువెల్లా నదై తడిపిందా మది..?
వదిలేసింది ప్రాణాన్ని నా ఊపిరి...
హృదయమా.. హృదయమా.. శిథిలమయ్యావా.. ఆ..
ప్రియతమా.. ప్రియతమా.. మరచిపోయావా.. ప్రేమా...

చరణం 1:
కనులకందని కలలు వేరని మనసుకేం తెలుసే..?!
పలకరించని కునుకు ఏదని కలలు నన్నడిగే...
ఎదురుచూపుల దరికి రానని గురుతుగా నిలిచే...
కుదురు కోరిన ఎదని కాదని కలహమయ్యావే..?!
నీ కోసం.. నా లోకం.. ఒక ఆకాశం చేసినా.. 
నా చుట్టూ.. ఈ శూన్యం.. విడిపోదే...!!!
నీ స్నేహం.. ఈ బంధం.. కలకాలాలను దాటినా..
నా వెంటే.. ఆనందం.. మరి లేదే...!!!
మనసు వెతికే చెలిమి కోసం మథనమవసరమా...
మమత దొరికే ప్రేమ దరికే కథల చిరునామా...
వెన్నెలైనా వాలిపోదా మొదటి వేకువజాముకే..!!
మంచులాగా కరిగిపోదా రవికి దొరకని చీకటే..!!
వెన్నెలా.. ఓ నిన్నలా.. నాతోనే ఉంటావా..?
నడిరేయిలా.. ఉదయాలకే.. దూరంగా ఉంటావా..?

|| హృదయమా.. హృదయమా.. ||

చరణం 2:
సహనమైనా ఓడిపోదా సమయమాడే ఆటలో...
బరువు మోసిన కనులకేమో తెరల మౌనం ఏమిటో...
పసిడి పలుకుల లాలి పాటకి పరవశించని కాలమా...
ఉసురు తగిలిన హృదయ వేదన తరలిపోదని కోపమా...
ప్రణయమా.. నా ప్రణయమా.. దయలేని దారుణమా..?
ఒంటరై.. ఏకాకినై.. మిగిలాను నీ ఋణమా..?

|| హృదయమా.. హృదయమా.. ||

పల్లవి 2:
తెలియదా.. తెలియదా.. పయనమెందాకో...
తడబడే.. అడుగులే.. గమనమయ్యేనో...
నీ జంటే మరి నేనుంటానని..
మరుజన్మే సరి మన బంధాలకి..
విడిపోనంది నీ చేయి నా ఊపిరి...
హృదయమా.. హృదయమా.. మేలుకోగలవా.. ఆ..
ప్రియతమా.. ప్రియతమా.. తిరిగి రాగలవా.. ప్రేమా...


Feel it here on YouTube:
Full video:

Lyrical: