Lyrics: Sri Annapragada
Composition and Scoring: K.V. Bharadwaj
Singers: Karthik, Lakshmi Meghana, Abhigna Yanaganti
Cast: Phani Sivaraju, Kushitha Kallapu, Lakshmi Teja
Story, Screenplay and Direction: Phani Sivaraju
అడగవా.. అడగవా.. నిజం ఏమైందో...
చివరగా.. మిగిలిన.. గతం కానుందో..?
తన ఊసేదని అలిగిందా మరి..?
నిలువెల్లా నదై తడిపిందా మది..?
వదిలేసింది ప్రాణాన్ని నా ఊపిరి...
హృదయమా.. హృదయమా.. శిథిలమయ్యావా.. ఆ..
ప్రియతమా.. ప్రియతమా.. మరచిపోయావా.. ప్రేమా...
చరణం 1:
కనులకందని కలలు వేరని మనసుకేం తెలుసే..?!
పలకరించని కునుకు ఏదని కలలు నన్నడిగే...
ఎదురుచూపుల దరికి రానని గురుతుగా నిలిచే...
కుదురు కోరిన ఎదని కాదని కలహమయ్యావే..?!
నీ కోసం.. నా లోకం.. ఒక ఆకాశం చేసినా..
నా చుట్టూ.. ఈ శూన్యం.. విడిపోదే...!!!
నీ స్నేహం.. ఈ బంధం.. కలకాలాలను దాటినా..
నా వెంటే.. ఆనందం.. మరి లేదే...!!!
మనసు వెతికే చెలిమి కోసం మథనమవసరమా...
మమత దొరికే ప్రేమ దరికే కథల చిరునామా...
వెన్నెలైనా వాలిపోదా మొదటి వేకువజాముకే..!!
మంచులాగా కరిగిపోదా రవికి దొరకని చీకటే..!!
వెన్నెలా.. ఓ నిన్నలా.. నాతోనే ఉంటావా..?
నడిరేయిలా.. ఉదయాలకే.. దూరంగా ఉంటావా..?
|| హృదయమా.. హృదయమా.. ||
చరణం 2:
సహనమైనా ఓడిపోదా సమయమాడే ఆటలో...
బరువు మోసిన కనులకేమో తెరల మౌనం ఏమిటో...
పసిడి పలుకుల లాలి పాటకి పరవశించని కాలమా...
ఉసురు తగిలిన హృదయ వేదన తరలిపోదని కోపమా...
ప్రణయమా.. నా ప్రణయమా.. దయలేని దారుణమా..?
ఒంటరై.. ఏకాకినై.. మిగిలాను నీ ఋణమా..?
|| హృదయమా.. హృదయమా.. ||
పల్లవి 2:
తెలియదా.. తెలియదా.. పయనమెందాకో...
తడబడే.. అడుగులే.. గమనమయ్యేనో...
నీ జంటే మరి నేనుంటానని..
మరుజన్మే సరి మన బంధాలకి..
విడిపోనంది నీ చేయి నా ఊపిరి...
హృదయమా.. హృదయమా.. మేలుకోగలవా.. ఆ..
ప్రియతమా.. ప్రియతమా.. తిరిగి రాగలవా.. ప్రేమా...
Feel it here on YouTube:
Full video:
Lyrical:
No comments:
Post a Comment