Friday, February 19, 2016

Nanna ane Nammakam...

తెలుగు మీద, అమ్మ మీద ఇష్టాన్ని చూపించుకోవటానికి ఒకసారి కవిత్వం లాంటిది ఒకటి రాసా... ఇప్పుడు అమ్మ లాంటి నాన్న మీద ఇష్టం చూపించాలి అంటే, అదే తెలుగు కావాలి అనిపించి ఇది మొదలుపెట్టా... ఇది నాన్నకు ప్రేమతో...



నాన్న... 
ఉయ్యాలలో జరిగిన మన పరిచయం.. 
కళ్ళల్లో కదిలిన నీ సంతోషం... 
నాకోసం కలగన్న ఓ ప్రపంచం.. 
నాన్నకు అర్ధం తొలి నమ్మకం... 

అమ్మ పాడించే "అ ఆ" ల పాటకి.. 
బలపాన్ని దిద్దించే చెయ్యొకటి సాయం... 
ఆ చెయ్యి తోడొచ్చె ప్రతి అడుగు బాటకి.. 
నాన్నంటే ఏమంటే తెలిసింది ఆ క్షణం... 

కష్టాన్ని కాష్టంగా రగిలిస్తూ రోజూ.. 
సాయంత్రం తనదైన వెన్నెల తెస్తాడు... 
అలసటల్లేని ప్రతి పూట లాలసం.. 
సూరీడు నాన్నకి దగ్గరి బంధుత్వం..

ఆడించిన కొత్త బొమ్మల ఆనందం ఒకెత్తు.. 
దెబ్బలకి రాసిన మందుల బాధ ఒకెత్తు...  
జీవితాన ప్రతి బొమ్మకి బొరుసుకి.. 
నాన్న చేసే ఆలోచన అతిపెద్ద ఎత్తు... 

వేలు పట్టి నడిపించినా.. 
చెయ్యి పట్టి గెలిపించినా.. 
వెన్ను తట్టి ప్రోత్సహించినా.. 
భుజం తట్టి ఊరడించినా.. 
తల మొట్టి దెబ్బలేసినా.. 
తల మొట్టి ఆశీర్వదించినా.. 
నాన్న ప్రేమ కదిలించింది... 
నాన్న అనే నమ్మకం కనిపించింది... 

ఇది అమ్మ లాంటి నాన్న కోసం... 



Meaning:


ఉయ్యాలలో జరిగిన మన పరిచయం..
కళ్ళల్లో కదిలిన నీ సంతోషం...
నాకోసం కలగన్న ఓ ప్రపంచం..

నాన్నకు అర్ధం తొలి నమ్మకం...

The first time a father meets his baby is in the cradle... Nobody can imagine how happy he was at that time... Only people can see tears swirling around in his eyes... From then, he starts making plans to gift a beautiful life to his child... That's where he holds the top position of trust in our hearts...


అమ్మ పాడించే "అ ఆ" ల పాటకి..
బలపాన్ని దిద్దించే చెయ్యొకటి సాయం...
ఆ చెయ్యి తోడొచ్చె ప్రతి అడుగు బాటకి..
నాన్నంటే ఏమంటే తెలిసింది ఆ క్షణం...

We sing alphabet along with our mothers in the form of a song but our father is the one who teaches us to learn them and to write... His helping hand is always there wherever and whenever needed in our lives... That's when he'll be known what a father really is...


కష్టాన్ని కాష్టంగా రగిలిస్తూ రోజూ..
సాయంత్రం తనదైన వెన్నెల తెస్తాడు...
అలసటల్లేని ప్రతి పూట లాలసం..
సూరీడు నాన్నకి దగ్గరి బంధుత్వం..

He will burn his sweat all day to earn... By evening, he'll come home with something in his hand for his child... He is completely devoted to his children and family with no signs of tiredness... These examples show him as a close relative of Sun who does the same every time...


ఆడించిన కొత్త బొమ్మల ఆనందం ఒకెత్తు.. 
దెబ్బలకి రాసిన మందుల బాధ ఒకెత్తు...  
జీవితాన ప్రతి బొమ్మకి బొరుసుకి.. 
నాన్న చేసే ఆలోచన అతిపెద్ద ఎత్తు... 

No matter, he plays with the children with all the toys he bought, no matter how bad he feels while applying medicine to his child's injuries, he will come along with us in all our ups and downs and he gives his best advises all the time... That's our biggest asset...


వేలు పట్టి నడిపించినా.. 
చెయ్యి పట్టి గెలిపించినా.. 
వెన్ను తట్టి ప్రోత్సహించినా.. 
భుజం తట్టి ఊరడించినా.. 
తల మొట్టి దెబ్బలేసినా.. 
తల మొట్టి ఆశీర్వదించినా.. 
నాన్న ప్రేమ కదిలించింది... 
నాన్న అనే నమ్మకం కనిపించింది... 

We learnt how to walk by holding his finger...
We learnt how to win by holding his hand...
He encouraged us all the time by patting our back...
He soothed us whenever needed by patting our shoulders...
He mended us by all means...
He blessed us completely...
Whatever he does, only his love gets glorified...
Only our trust on him gets reflected...




Tuesday, February 2, 2016

My frustration on caste extremism...

I knew from a long time about the superlative feelings of caste in our country especially in our Telugu states but recently, I was surprised and rather shocked by the events that happened in Andhra Pradesh. I didn't expect the extent, some politicians go, to encourage people to destroy their own properties (I mean, public properties) for the sake of caste. I wanted to put all my displeasure in words and here it is.


ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?

ఏ దేవుడిచ్చాడు కులమన్న బిరుదు..?
ఏ భాషలో చెప్పి భూమ్మీదకొదిలాడు..?
ఆయనిచ్చిన ప్రాణంలో మనిషికే కులమా..?
జీవకోటికే లేని కులపిచ్చి నీకెందుకురా..?

ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?

నీ తల్లి పేగుకెరుకా..? ఆ రొమ్ము పాలకెరుకా..?
పసి వయసులో విన్న లాలికెరుకా..? పొత్తిళ్ళలో కన్న కలలకెరుకా..?
నీ పుట్టుకకి కానిది నీకెందుకురా..?

ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?

నీ తండ్రి చెమటకెరుకా..? రక్తమోడ్చిన డబ్బుకెరుకా..?
తన కాయకష్టానికెరుకా..? తన బిడ్డకిచ్చె సుఖానికెరుకా..?
నీ దారిన లేనిది నీకెందుకురా..?

ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?

నీ తిండి గింజకెరుకా..? ను పీల్చే గాలికెరుకా..?
నీ బిందె నీటికేరుకా..? నీ ఒంటి గుడ్డకెరుకా..?
నీ బ్రతుకుకి రానిది నీకెందుకురా..?

ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?

కమ్మోరు, కాపులోరు, సాములోరు, పాలేర్లని... 
మనిషన్న వాడిని నరికేస్తూపోతే... 
ఏ కీలు కా కీలు ఎంచేస్తది పాపం... 
ఒక్కోటి కొట్టుకొని మనిషినే మింగేస్తది... 
నువ్వు పెట్టిన చిచ్చు నిన్నే ఎసేస్తది... 
నీ చావు తెచ్చేది నీకెందుకురా..?

నీ గుండె నెత్తురు చెప్పదు... నీ కాటి కలప చెప్పదు... 
ఈ మధ్యనున్న జీవమూ చెప్పదు... 
నీకున్న ఆకలి చెప్పదు... నువ్వు దాచే ఏడుపు చెప్పదు... 
నీ నాడి లోనుండే అలజడి చెప్పదు... 
దేనికీ కాని కులగజ్జి నీకెందుకురా..?

మనకొద్దు మనకొద్దు ఈ పిచ్చి అంటూ... 
మారాలి పదిమంది పనిగట్టుకుంటూ...
ఇకనైనా విడిచేస్తే మనిషంటూ ఉంటాడు... 
లేదంటే కాలంలో గుర్తెరుగక పోతాడు...