I knew from a long time about the superlative feelings of caste in our country especially in our Telugu states but recently, I was surprised and rather shocked by the events that happened in Andhra Pradesh. I didn't expect the extent, some politicians go, to encourage people to destroy their own properties (I mean, public properties) for the sake of caste. I wanted to put all my displeasure in words and here it is.
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
ఏ దేవుడిచ్చాడు కులమన్న బిరుదు..?
ఏ భాషలో చెప్పి భూమ్మీదకొదిలాడు..?
ఆయనిచ్చిన ప్రాణంలో మనిషికే కులమా..?
జీవకోటికే లేని కులపిచ్చి నీకెందుకురా..?
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
నీ పుట్టుకకి కానిది నీకెందుకురా..?
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
నీ దారిన లేనిది నీకెందుకురా..?
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
నీ బ్రతుకుకి రానిది నీకెందుకురా..?
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
ఏ దేవుడిచ్చాడు కులమన్న బిరుదు..?
ఏ భాషలో చెప్పి భూమ్మీదకొదిలాడు..?
ఆయనిచ్చిన ప్రాణంలో మనిషికే కులమా..?
జీవకోటికే లేని కులపిచ్చి నీకెందుకురా..?
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
నీ తల్లి పేగుకెరుకా..? ఆ రొమ్ము పాలకెరుకా..?
పసి వయసులో విన్న లాలికెరుకా..? పొత్తిళ్ళలో కన్న కలలకెరుకా..?నీ పుట్టుకకి కానిది నీకెందుకురా..?
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
నీ తండ్రి చెమటకెరుకా..? రక్తమోడ్చిన డబ్బుకెరుకా..?
తన కాయకష్టానికెరుకా..? తన బిడ్డకిచ్చె సుఖానికెరుకా..?నీ దారిన లేనిది నీకెందుకురా..?
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
నీ తిండి గింజకెరుకా..? ను పీల్చే గాలికెరుకా..?
నీ బిందె నీటికేరుకా..? నీ ఒంటి గుడ్డకెరుకా..?నీ బ్రతుకుకి రానిది నీకెందుకురా..?
ఎవడింటి వాడివిరా నువ్వు ఏ కులపోడివిరా..?
కమ్మోరు, కాపులోరు, సాములోరు, పాలేర్లని...
మనిషన్న వాడిని నరికేస్తూపోతే...
ఏ కీలు కా కీలు ఎంచేస్తది పాపం...
ఒక్కోటి కొట్టుకొని మనిషినే మింగేస్తది...
నువ్వు పెట్టిన చిచ్చు నిన్నే ఎసేస్తది...
నీ చావు తెచ్చేది నీకెందుకురా..?
నీ గుండె నెత్తురు చెప్పదు... నీ కాటి కలప చెప్పదు...
ఈ మధ్యనున్న జీవమూ చెప్పదు...
నీకున్న ఆకలి చెప్పదు... నువ్వు దాచే ఏడుపు చెప్పదు...
నీ నాడి లోనుండే అలజడి చెప్పదు...
దేనికీ కాని కులగజ్జి నీకెందుకురా..?
మనకొద్దు మనకొద్దు ఈ పిచ్చి అంటూ...
మారాలి పదిమంది పనిగట్టుకుంటూ...
ఇకనైనా విడిచేస్తే మనిషంటూ ఉంటాడు...
లేదంటే కాలంలో గుర్తెరుగక పోతాడు...
No comments:
Post a Comment