Sunday, August 28, 2016

Era of Rakshasa Rajyam...

Never heard before, of a song, from a villain's point of view. Theemai Dhaan Vellum is a song that amplifies villainy to such extent that it actually shadows heroism of the protagonist. A new challenge for me to test and improve my writing skills to a level above.

Song:   Theemai Dhaan Vellum
Movie:  Thani Oruvan
Singer:  Hip Hop Tamizha & Arvind Swamy
Lyrics:  Hip Hop Tamizha

Alternative Lyrics:  Swaroop Annapragada


"మంచివాడికి తోచిన పని మంచిగానే ఉంటుంది... 
చెడ్డవాడు చేసే హాని నాకు అద్భుతం అనిపిస్తుంది... 
ఒక మంచికి అద్భుతానికి జరిగే యుద్ధంలో అద్భుతమే గెలుస్తుంది..."

ఆకాశం చీల్చే.. పిడుగే వీడు...
ఉన్మాదం విసిరి ఉరితీస్తాడు...

రక్కసి మూకల రాజుని నేనేరా...
భయమే వరమని గుండెలు బిగిసేనా...
చీకటి వేటకి ఆయుధం అవసరమా..?
ఆకలి కత్తికి సత్తువ బలి అవదా..?

"ఆరిపోని రావణకాష్టం లాంటిది అమానుషం అంటే...
అది నన్ను ఆగిపోనివ్వదు...
I'm not bad... Just evil..."

హహహహహహహహ్హా...

ప్రాణం పాచిక వేస్తా.. నీ బ్రతుకే బానిస చేస్తా.. 
గతి తప్పిన గుండెలనే తొక్కుతూ అంబరమెక్కేస్తా...
స్వార్ధం ఊపిరి చేస్తా.. నా మర్మం మాటలు చేస్తా...
అణిచేసే ఆయువుకే అలజడి అరుపులు వినిపిస్తా... 

|| రక్కసి మూకల ||

"నిరూపించటానికి నిజం అనేది ఒక్కటే... 
కానీ అబద్ధానికి లక్ష దారులు..."


యముడిని నేనెదిరిస్తా.. నరకాన్నే నాదనుకుంటా..
క్రూరత్వం మరిగించే రుచులే ఆస్తిగా చేస్కుంటా...
మోసం మతమే చేస్తా.. దుర్మార్గం గీతని చేస్తా..
వ్యాపించే ద్రోహాన్నే గోడగా రాజ్యం నిర్మిస్తా... 

|| ఆకాశం చీల్చే ||

"The name is Siddharth Abhimanyu... Good luck..."



No comments:

Post a Comment