Original song: Nijame ne chebutunna...
Movie: Oori peru Bhairavakona
Original Song Lyrics: Srimani
Female Version Lyrics: Sri Annapragada
పల్లవి:
నీ నిజమే నే విన్నా జానే జానా..
కలలాగే అనిపించినా...
కళ్ళారా చూస్తూన్నా నీ తపనంతా.. నిజమంటే కాదంటానా...
వీడనే నిను వీడనే.. నా మనసంతా నీదేనులే...
రంగులే వెదజల్లితే.. ఆ కుంచెకి ప్రాణం నువ్వే...
చరణం 1:
వెన్నెల నేనే.. వెండి వర్షం నేనే..
కదిలించే సూరీడివి నువ్వైయావే...
కన్నుల తోటి పంపిన లేఖల్లోనే..
కనిపించిందా నాలో పొంగే ప్రేమే...
బుగ్గల్లో ఎరుపైన అందమే..
సిగ్గల్లే మారి కవ్వించేనే...
ఉలుకైనా పలుకైనా లేదులే..
గుండెల్లో పాటై నిలిచావులే...
|| నీ నిజమే నే విన్నా ||
చరణం 2:
పెదవుల చాటే దాగిన తలపుల్లోనే..
నే పలికిన ప్రతి మాట భావం నువ్వే...
దూరం కొలిచే ఇద్దరి పయనం లోనే..
దగ్గర చేసే ప్రణయం దాగుందిలే...
నాతోనే నువ్వుంటే సందడై..
నీవెంటే తోడుంటా సవ్వడై...
ఆకాశం అంచుల్లో తారలై..
కలకాలం నిలిచే ఓ బంధమై...
|| నీ నిజమే నే విన్నా ||
No comments:
Post a Comment